![]() |
![]() |
.webp)
జీ తెలుగులో సరిగమప లిటిల్ చాంప్స్ ప్రతీ వారం పిల్లల్ని పెద్దలను అలరిస్తోంది. ఇక ఈ వారం కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే సెంట్రాఫ్ అట్రాక్షన్ గా వరుణవి ప్రతీ వారం కొత్త కొత్త పాటలు ఎంటర్టైన్ చేస్తోంది. ఈ ప్రోమోలో వరుణవి స్టేజి మీదకు రాగానే "హాయ్ సుధీర్ మామ" అని పలకరించింది. "ఇదేంటి సడెన్ గా ఇంత మార్పు వచ్చింది నీలో" అని అడిగాడు సుధీర్. "పాత సినిమాలు చూడలేదా అందులో పిల్లలు ఇలాగే మంచిగా ఉంటారు" అని చెప్పింది. "పాత సినిమాలు పెద్దగా చూడలేదమ్మా" అన్నాడు సుధీర్. "అప్పట్లోనే పుట్టావ్ కదా ఐనా చూడాలేదా" అని కౌంటర్ వేసింది. దానికి ఆన్సర్ చెప్పలేదు సుధీర్.
తర్వాత "పిల్లలు దేవుడు చల్లని వారే" అనే సాంగ్ పాడింది. "పిల్లలు దేవుడు చల్లని వారంటారు కదా నువ్వు కూడా దేవుడి లాంటి బిడ్డవే" అంటూ రోజా వరుణవికి కాంప్లిమెంట్ ఇచ్చింది. "రోజు రోజుకూ నీలో ఇంప్రూవ్మెంట్ ఎంత బాగుందో అసలు" అంటూ జడ్జి శైలజ మెచ్చుకున్నారు. "దొండకాయ్, బెండకాయ్ నువ్వే నా గుండెకాయ్" అంటూ శైలజ గారికి చెప్పింది వరుణవి. రోజా గారి గురించి ఏమన్నా చెప్పాలి కదా అని సుధీర్ అడిగాడు. "వీటిల్లో నాకిష్టం కాజా. జడ్జెస్ లోనే స్వీట్ మా రోజా" అని సుధీర్ తాను చెప్పిన ఈ డైలాగ్ చెప్పమన్నాడు. "జడ్జెస్ వాళ్ళ స్వీట్ మా దోశ" అంటూ లైన్ ని మర్చి చెప్పేసింది. అంతే ఆ డైలాగ్ కి అనిల్ రావిపూడి, రోజా అంతా పగలబడి నవ్వేశారు.
![]() |
![]() |